ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా బ్రహ్మయ్య | brahmaiah to mudiraj mahasabha state president | Sakshi
Sakshi News home page

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా బ్రహ్మయ్య

Jul 13 2015 9:29 AM | Updated on Sep 3 2017 5:26 AM

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన వీర్ల బ్రహ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విజయవాడ (మధురానగర్): ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన వీర్ల బ్రహ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో ఆదివారం జరిగిన మహాసభ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలని, సమన్వయంతో పనిచేయాలని సమావేశం తీర్మానం చేసింది. బ్రహ్మయ్యను ముదిరాజ్ మహాసభ జిల్లా, నగర అధ్యక్షులు సాధనాల ప్రసాదరావు, దాసం రామరాజు, ఎన్జీవో నాయకులు పి.వి.ఎల్.ఎన్.రాజు, కంభం కొండలరావు, బలరామ్ అభినందించారు. సమావేశంలో 13 జిల్లాలకు చెందిన ముదిరాజ్ మహాసభ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement