పేదింటికి పెద్ద కష్టం

Boy Suffering From Bone Cancer In Palakonda Srikakulam District - Sakshi

బోన్‌ కేన్సర్‌తో బాధ పడుతున్న విద్యార్థి

చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చు

తట్టుకోలేకపోతున్న తల్లిదండ్రులు

సాయం కోసం అభ్యర్థన   

సాక్షి, పాలకొండ రూరల్‌: అసలే మధ్య తరగతి కుటుంబం. అటుపై రెక్కాడితే గానీ డొక్కాడని వైనం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. అంది వస్తాడని అనుకున్న చిన్న కుమారుడిపై బోన్‌ కేన్సర్‌ రూపంలో పంజా విసిరింది. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో ఆ కుర్రాడిని మంచా నికి పరిమితం చేసింది. బిడ్డను రక్షించుకునేం దుకు తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తోంది.  పాలకొండ పట్టణం కోరాడ వీధి సమీ పంలో నివాసముంటున్న జోగ ఎర్రంనాయు డు, లక్ష్మి దంపతుల మూడో కుమారుడు గంగరాం స్థానిక పెదకాపువీధి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తున్న గం గారంకు మూడు నెలల కిందట వెన్ను, భుజం భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో తల్లిదండ్రులు తమ బిడ్డను శ్రీకాకుళం తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు.

భుజం లో ఎముక చిట్లి ఉంటుందని వైద్యులు భా వించి అందుకు తగ్గట్టుగా మందులు అందించారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదు. దీంతో పాటు బిడ్డ శరీరంలో స్వల్ప మార్పులు రావడం తల్లిదండ్రులు గమనించారు. మెరుగైన వైద్యం కోసం మహాత్మాగాంధీ కేన్స ర్‌ ఆస్పత్రిలో చేర్చారు. దాదాపు రూ.3 లక్షలు ఖర్చుచేయడంతో తమ కుమారుడికి బోన్‌ కేన్సర్‌ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న గంగా రాం తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నకొడుకును ప్రాణాంతక వ్యాధి రోజు రోజుకూ కబళిస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే గంగారాం కీమోథెరపీ చేయించుకునే పరిస్థితికి చేరుకున్నాడు. ఒక్కో ఇంజెక్షన్‌ రూ.3,500, తనకు అందిస్తున్న మాత్రలు రూ.1600 ఖర్చు చేయడం ఆ తల్లిదండ్రులకు తల కు మించిన భారమైంది.

ఆటో నడుపుకుని కుటుం బాన్ని పోషిస్తున్న బాధితుడు గంగారాం తండ్రి ఎర్రంనా యు డు అప్పు చేసి కుమారుడిని రక్షించుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. కళ్ల ముందే కుంగిపోతున్న కుమారుడి దయనీయ స్థితికి ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. దాదాపు రూ.10 లక్షలు ఉంటే గానీ మెరుగైన వైద్యం, ఆపరేషన్లు చేయలేమని విశాఖకు చెందిన పికానికి ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారని తల్లిదండ్రులు చెబుతుతున్నారు. మనసున్న మారాజులు ముందుకు వచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు సహకరిస్తారని ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పాలకొండ ప్రభుత్వ బాలికల కళాశాల యాజమాన్యం కొంతమేర ఆర్థిక సాయం అందించింది. ఈ కోవలోనే మానవతా దృక్పథంతో సహకరించాలని ఆ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

తమ దయనీయమైన పరిస్థితిపై ఆరా తీసేందుకు 9346877720, 7729055065 నంబర్లకు ఫోన్‌ చేయాలని, చెమర్చిన కళ్లతో  అభ్యర్థిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top