ఇరుప్రాంతాల వారు సంయమనం పాటించాలి: జానారెడ్డి | Both region people maintain harmony : K. Janareddy | Sakshi
Sakshi News home page

ఇరుప్రాంతాల వారు సంయమనం పాటించాలి: జానారెడ్డి

Aug 17 2013 4:59 PM | Updated on Sep 1 2017 9:53 PM

అలిపిరి వద్ద రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై సమైక్యవాదుల దాడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.జానారెడ్డి ఖండించారు.

అలిపిరి వద్ద రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై సమైక్యవాదుల దాడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.జానారెడ్డి శనివారం ఖండించారు. సంయమనం పాటించాలని అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ప్రాంతాల ప్రజలకు ఆయన సూచించారు. రెచ్చగొట్టే చర్యలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎంతో సహా ఎవరైన పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని జానారెడ్డి స్పష్టం చేశారు. సీఎం సమైక్య రాష్ట్రం అని చెప్పడం ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. లేదంటే కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని జానారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement