'వాళ్లంతా.. గడ్డి కోసుకోవటానికొచ్చారా?' | bojjala gopala krishna reddy statement on red sand wood smugglers | Sakshi
Sakshi News home page

'వాళ్లంతా.. గడ్డి కోసుకోవటానికొచ్చారా?'

Apr 8 2015 1:18 PM | Updated on Apr 3 2019 5:55 PM

'వాళ్లంతా.. గడ్డి కోసుకోవటానికొచ్చారా?' - Sakshi

'వాళ్లంతా.. గడ్డి కోసుకోవటానికొచ్చారా?'

తిరుపతి ఎన్కౌంటర్లో మృతి చెందినవారంతా ఎర్ర చందనం దొంగలేనని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు.

తిరుపతి : తిరుపతి ఎన్కౌంటర్లో మృతి చెందినవారంతా ఎర్ర చందనం దొంగలేనని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఎన్కౌంటర్పై వస్తున్న ఆరోపణలను ఆయన బుధవారమిక్కడ ఖండించారు.  ఎర్రచందనం దొంగలు కాకుంటే.. వారంతా గడ్డి కోసుకోవటానికి ఏమైనా తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వచ్చారా అని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.


ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది విచారణలో తేలుతుందని బొజ్జల అన్నారు.  ఎర్ర చందనం స్మగ్లర్లు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా వదిలేది లేదని ఈ సందర్భంగా బొజ్జల స్పష్టం చేశారు. మృతదేహాలను తమిళనాడుకు పంపిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందిన 20మంది ఎర్రచందనం కూలీల మృతదేహాలకు తిరుపతి రూయా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement