బీజేపీది నమ్మకద్రోహం | BJP government betraying the andra state | Sakshi
Sakshi News home page

బీజేపీది నమ్మకద్రోహం

May 26 2015 4:05 AM | Updated on Mar 29 2019 9:04 PM

బీజేపీది నమ్మకద్రోహం - Sakshi

బీజేపీది నమ్మకద్రోహం

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్ బాబూరావు విమర్శించారు...

- రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి   
- సీపీఎం నగర కార్యదర్శి బాబూరావు
విజయవాడ :
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం  నగర కార్యదర్శి  సీహెచ్ బాబూరావు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు సోమవారం విజయవాడ  సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.  బాబూరావు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన బీజేపీ అధికారంలోకి రాగానే మాట మార్చిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక  హోదా రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రత్యేక  హోదా లేకుండా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధపడడం శోచనీయమన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో, ఎన్ని నిధులతో నిర్మించనున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.  ప్రత్యేక హాదాను సాధించేందుకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కె. శ్రీదేవి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement