రెండు బైకులు ఢీ: ఒకరి పరిస్థితి విషమం | bike accident : two injured in piduguralla | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ: ఒకరి పరిస్థితి విషమం

Aug 18 2015 11:11 AM | Updated on Aug 25 2018 5:39 PM

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

గుంటూరు : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల మండలం అయప్పనగర్ జాతీయ రహదారిపై ఓ బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement