విభజనయత్నం.. అహంకారపూరితం | bifurcation is not in right way, says ravishankar | Sakshi
Sakshi News home page

విభజనయత్నం.. అహంకారపూరితం

Feb 15 2014 1:25 AM | Updated on Aug 18 2018 4:13 PM

విభజనయత్నం.. అహంకారపూరితం - Sakshi

విభజనయత్నం.. అహంకారపూరితం

కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార పూరితంగా వ్యవహరిస్తూ, హడావుడిగా ఆంధ్రప్రదేశ్ విభజనకు సిద్ధమవుతోందని, ఇది మంచిది కాదనీ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార పూరితంగా వ్యవహరిస్తూ, హడావుడిగా ఆంధ్రప్రదేశ్ విభజనకు సిద్ధమవుతోందని, ఇది మంచిది కాదనీ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అభిప్రాయపడ్డారు. విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసినప్పటికీ కేంద్రం మొండిగా ముందుకు వెళుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ద్వారా అంతర్జాతీయస్థాయిలో పేరొందిన రవిశంకర్ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాలను వెల్లడించారు.


  కేంద్రంలోని పాలకులు ఆంధ్రప్రదేశ్‌ను కురుక్షేత్రంలా మార్చేశారు. ప్రాంతాలు, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేశారు. కేవలం కొందరి స్వార్థం కోసం విభజనకు పాల్పడుతుండడం విచారకరం.   ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించాలి. దీనిని తోసిపుచ్చి విభజనపై ముందుకు వెళ్ళడం సరైనది కాదు. ఈ చర్యల ద్వారా రాష్ట్రాన్నీ, దేశాన్నీ మరో 50 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళినట్టే అవుతుంది. హడావిడిగా తీసుకొనే నిర్ణయాలు ఏవైనా చివరకు వృథాగా మారతాయి. నా వ్యాఖ్యలతో వివాదాలు రేగినా వెనుకాడను.   పార్లమెంటులో గురువారం ఘటన కేంద్రం తప్పిదం వల్లే జరిగింది. చివరకు సొంత మంత్రుల మాటకు కూడా విలువ లేకుండా పోయింది. కొంతకాలంగా అభివృద్ధి ఆగిపోయి ఏపీ పూర్తిగా స్తంభించి పోయింది. ప్రస్తుతం దేశంలో పాలన చచ్చుబడి పోయింది. మన ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉంది. ఈ పరిస్థితుల్లో సుస్థిర, దృఢ ప్రభుత్వం అవసరం. దేశాన్నీ, రాష్ట్రాన్నీ సమర్థులైన పాలకుల చేతుల్లో పెట్టాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement