‘వారికి బాబు సర్కార్‌ ద్రోహం చేస్తోంది’ | Bhumana Karunakar Reddy Protest For Scavengers Colony | Sakshi
Sakshi News home page

‘వారికి బాబు సర్కార్‌ ద్రోహం చేస్తోంది’

Nov 5 2018 1:07 PM | Updated on Nov 5 2018 5:07 PM

Bhumana Karunakar Reddy Protest For Scavengers Colony - Sakshi

మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి

సాక్షి, తిరుపతి : తిరుపతి నడిబొడ్డులో ఉంటున్న స్కావెంజర్స్‌ కాలనీ వాసులకు చంద్రబాబు నాయుడు సర్కార్‌ తీవ్ర ద్రోహం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌ సీపీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ.. స్కావెంజర్స్‌ కాలనీలో ఉంటున్న వారంతా నిరుపేద గిరిజనులు, పారిశుద్ద్య కార్మికులని, వారు అనారోగ్యాలతో బాధపడుతున్నారని తెలిపారు.

తిరుపతి నడిబొడ్డులో దశాబ్దాలుగా ఉంటున్న స్కావెంజర్స్‌ కాలనీ వాసులను ఖాలీ చేయించి వెల్లగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కావెంజర్స్‌ కాలనీలో బహుళ అంతస్తుల భవనాల పేరుతో మంత్రి నారాయణ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చటానికి చం‍ద్రబాబు సర్కార్‌ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని వైఎస్సార్‌ సీపీ పోరాటాల ద్వారా అడ్డుకుందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ గృహ నిర్మాణాల పేరుతో స్కావెంజర్స్‌ కాలనీ వాసులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement