గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి | bhuma nagireddy suffered heart stroke two times | Sakshi
Sakshi News home page

గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి

Mar 12 2017 3:08 PM | Updated on Sep 5 2017 5:54 AM

గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి

గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి

ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఈ రోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా పిట్స్ వచ్చాయని, వెంటనే ఆయన్ను ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారని డాక్టర్ హరినాథ్ చెప్పారు.

నంద్యాల: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఈ రోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా పిట్స్ వచ్చాయని, వెంటనే ఆయన్ను ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారని డాక్టర్ హరినాథ్ చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల తీసుకొచ్చారని తెలిపారు.

భూమాకు తీవ్ర గుండెనొప్పి రావడంతో పల్స్ రేట్ పడిపోయిందని, దాదాపు రెండు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని డాక్టర్ హరినాథ్ చెప్పారు. 1999లో నాగిరెడ్డికి మొదటిసారి బైపాస్ సర్జరీ చేశారని, ఏడాదిన్నర క్రితం ఆయనకు మరోసారి గుండెపోటు రావడంతో యాంజియోగ్రామ్ చేశారని తెలిపారు. భూమాకు షుగర్, బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నాయని చెప్పారు. నాగిరెడ్డికి గుండెనొప్పి రావడానికి తీవ్ర మానసిక ఒత్తిడి కూడా కారణమని డాక్టర్ హరినాథ్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement