భరత్@ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ | Bharat Telugu Book of Records | Sakshi
Sakshi News home page

భరత్@ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్

Jun 16 2014 2:12 AM | Updated on Sep 2 2017 8:51 AM

భరత్@ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్

భరత్@ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్

మల్టీ టాలెంట్ స్కిల్స్‌తో అదరగొడుతూ వండర్ వరల్డ్‌లో చోటు సంపాదించుకున్న చిన్నా రి భరత్‌కు ఇప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.

విజయనగరం టౌన్: మల్టీ టాలెంట్ స్కిల్స్‌తో అదరగొడుతూ వండర్ వరల్డ్‌లో చోటు సంపాదించుకున్న చిన్నా రి భరత్‌కు ఇప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి కోసం ఏర్పాటు చేసిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్న వయసులోనే చోటు సంపాదించిన ఘనత భరత్‌కే దక్కిందని తల్లిదండ్రులు తెలిపారు. పట్టణంలోని గాజులరేగ బీటీఆర్ కాలనీలో నివాసముంటున్న కోరాడ భరత్ చంద్ర మూడేళ్ల ప్రాయం నుంచి అద్భుతాలు సృష్టిస్తున్నాడు.
 
 అద్భుతమైన జ్ఞాపక శక్తితో ప్రముఖ వ్యక్తులు, నక్ష త్రా లు, ప్రపంచ వింతలు వంటి వాటిని గుర్తుంచుకుని రికార్డులు సాధిస్తున్నాడు. తల్లిదండ్రులు రమణా, హేమలతలు ప్రత్యేక దృష్టి సారించి ఈ బుడతడిని ముందుకు తీసుకెళుతున్నారు. ప్రస్తుతం ఈ పిడుగు గాజులరేగలో ఉన్న శారదా విద్యాపీఠ్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికా ర్డ్స్ ప్రతినిధులు గంట న్నర సేపు ఆన్‌లైన్‌లో ఇం టర్వ్యూ చేసి, సమాధానాలకు మెచ్చుకుని ప్రశంసాపత్రం, మెడల్, అవార్డు అందజేశారన్నారు. అ వార్డు రావడంపై పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement