
బెల్టు షాపులను సమూలంగా నిర్మూలిస్తాం
బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
నెల్లూరు(క్రైమ్): బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ ఉద్యోగులతో బెల్టుషాపుల నిర్మూలనపై గురువారం సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూగత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తూ సిండికేట్లను ప్రోత్సహించిందన్నారు. మద్యం ద్వా రా ఆదాయం పొందాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బెల్టు నిర్మూలనకు నడుం బిగించామన్నారు. టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేసి విసృ్తత దాడులు నిర్వహిస్తున్నామన్నారు.
ఇప్పటికే 2 వేల కేసులు నమోదు చేసి 1,800 మందిని జైలుకు పంపామన్నారు. త్వరలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ బెల్టుషాపులను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూ టీ కమిషనర్ డాక్టర్ వై. చైతన్యమురళీ బెల్టు దుకాణాల నిర్మూలనకు తీసుకుం టున్న చర్యలను వివరించారు. నెల్లూ రు, గూడూరు ఎక్సైజ్ ఈఎస్‌లు డాక్టర్ కె.శ్రీనివాస్, సుబ్బారావు, ఏఈఎస్ రవికుమార్‌రెడ్డి, టీడీపీ నేతలు కన్నబాబు, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామి పాల్గొన్నారు.
బీసీలకు మళ్లీ ‘ఆదరణ’
నెల్లూరు (దర్గామిట్ట): గతంలో వెనకబడిన తరగతులకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆదరణ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించనున్నట్లు బీసీ సంక్షేమ, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలి పారు. స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ మత్స్యకార సెల్ విభాగం, వివిధ మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో మంత్రిని గజమాలతో సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రెస్ హయాంలో బీసీలను నిర్లక్ష్యం చేశారన్నారు. ఎస్‌ఈజెడ్‌ల పేరుతో భూములన్నీ బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టారని ఆరోపిం చారు. గతంలో మాదిరిగా బీసీలకు సబ్‌ప్లాన్, కులవృత్తులకు పరికరాలను అందజేయునున్నట్లు చెప్పారు.
జిల్లా లో మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ అవసరం ఉందన్నారు. హార్బర్ నిర్మాణంపై సీఎంతో చర్చించి ఏర్పాటుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చా రు. పులికాట్ సరస్సులో ఇబ్బందులు లేకుండా పూడిక తీయునున్నట్లు చెప్పా రు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ బతుకుదెరువు కోసం తీరం వెంట పోరాడే మ త్స్యకారుల సంక్షేమానికి కృషిచేయాలని మంత్రిని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రూరల్ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు పొలిశెట్టి వెంకటరమణ, నూనె మలికార్జునయాదవ్, కొండూరు వెంకటరమణ, కొండూరు అనిల్, శివాజీ, యశోధ, పోలయ్య, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.