ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో తోడ్పడాలని ఓసీ సంక్షేమ సంఘం ...
ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో తోడ్పడాలని ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం వివిధ జాతీయ పార్టీల నేతలను కలిసి విజ్ఞప్తి చేసింది. బృందం సభ్యులు బుధవారమిక్కడ పార్లమెంటులో జేడీయూ అధినేత శరద్‌యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీపార్టీ అధినేత ములాయంసింగ్‌లతోపాటు మరికొందరు ఎంపీలను కలుసుకున్నారు. అగ్రవ ర్ణ పేదలకు రిజర్వేషన్ల కల్పించాల్సిన అవసరాన్ని గట్టిగా వివరించారు.