'మరణం లేని మహామనిషి బాపు' | Bapu is Great Man, says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

'మరణం లేని మహామనిషి బాపు'

Sep 1 2014 11:59 AM | Updated on Aug 18 2018 5:15 PM

'మరణం లేని మహామనిషి బాపు' - Sakshi

'మరణం లేని మహామనిషి బాపు'

బాపు మరణంతో తెలుగుజాతి యావత్తు ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు, దర్శకుడు బాపు మరణంతో తెలుగుజాతి యావత్తు ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.  బాపు మరణంపై శాసనసభలో సోమవారం సంతాపం తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... మరణం లేని మహామనిషి బాపు అన్నారు. ఆయన మరణంతో తెలుగుజాతి మంచి వ్యక్తిని కోల్పోయిందన్నారు. బాపు గీత, రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement