‘బంగారుతల్లి’పై నిర్లక్ష్యం వద్దు | 'Bangaru Thalli' scheme to roll out today | Sakshi
Sakshi News home page

‘బంగారుతల్లి’పై నిర్లక్ష్యం వద్దు

Oct 20 2013 7:12 AM | Updated on Jun 2 2018 8:36 PM

బంగారుతల్లి పథకంపై నిర్లక్ష్యం వహిస్తే సం బంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు.

తాడ్వాయి, న్యూస్‌లైన్ : బంగారుతల్లి పథకంపై నిర్లక్ష్యం వహిస్తే సం బంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హెచ్చరించారు.  శనివారం ఆయన తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రం పనితీరును పరిశీలించారు. గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందజేయాలని సూచించారు. గర్భిణులు ప్రసవ సమయంలో 108 అంబులెన్స్‌ను ఉపయోగించుకునేలా చూడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి రికార్డులన్నింటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.  పప్పుదినుసులు, బియ్యం, నూనె, తదితర వస్తువులు అందుతున్నాయా లేదా గర్భిణులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వికలాంగులకు పింఛన్ రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సదరన్ శిబిరానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.ఇటీవల కురిసిన భారీవర్షాలకు సోయా, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని నష్టపరిహారం అందించాలని కలెక్టర్‌ను రైతులు కోరారు. మండలంలోని నందివాడ, గ్రామపరిధిలో గల తండాలకు రోడ్డు వేయించాలని తండావాసులు కోరారు.
 
 ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి
 లింగంపేట: గ్రామాల్లో పేద మహిళల ప్రసవాలను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రద్యుమ్న వైద్య సిబ్బంది ని ఆదేశించారు. శనివారం లింగంపేట ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు.వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహిం చారు. మందులు సక్రమంగా ఇస్తున్నారాలేదా అని అడిగి తెల్సుకున్నారు.  సమీక్షలో జిల్లా శిశుసంక్షేమాధికారి రాములు,జిల్లావైద్య ఆరోగ్య అధికారి గోవింద్ వాగ్మారే,ఏడీఎంహెచ్‌ఓ  సురేష్ బాబు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement