చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది.
మదనపల్లి: చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. పెద్దమండ్యం మండల కేంద్రం సమీపంలో ముందు వెళుతున్న ఆటోను అధిగమించే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మదనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.