వనపర్తిలో బైపాస్ రహదారి నిర్మాణానికి అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు చందలా మారుతోంది.
వనపర్తిలో బైపాస్ రహదారి నిర్మాణానికి అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు చందలా మారుతోంది. భూమి కొనుగోలుకు అప్పట్లో రూ. 50లక్షలు కేటాయించి పదెకరాలు సేకరించాలనుకున్నారు. రూ.1.50 లక్షలు వెచ్చించి సర్వే చేయడంతో పట్టణవాసుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇంతలో భూమిరేట్లకు రెక్కలు మొలవడంతో అధికారులకు సేకరణ అంశం క్లిష్టంగా మారింది. నేతలూ దీనిపై పెదవి విప్పకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా ఏడేళ్లుగా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. ఇప్పుడు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం మళ్లీ తెరమీదకొచ్చింది.
నేతల నోటికి తాళం ఎందుకు...?
రోజూ రోజుకు పెరిగిపోతున్న టాఫిక్ సమస్య నియంత్రిచేందుకు గతంలో వనపర్తిలో రింగ్ రోడ్డు ఏర్పాటును ప్రతిపాదించారు. గతంలోనే ఇక్కడ బైపాస్ రహదారి నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మంజూరైన నిధులు సహితం రెండున్నరేళ్లపాటు నాన్చినాన్చి తిరిగి పంపించేశారు. ప్రగల్భాలు పలికిన మన నేతలు సైతం నోటికి తాళం వేసుకొని ఉండటంతో బైపాస్ రహదారి లక్ష్యం నీరుగారుతూ టైంపాస్‌గా మారింది. అటు రోడ్ల విస్తరణ జరగాక, ఇటు బైపాస్ రహదారి అమలుకు నోచుకోకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. అప్పటి గ్రామీణాభివద్థి శాఖ మంత్రి చిన్నారెడ్డి సూచన మేరకు 2008 మేలో ఇక్కడి అధికారులు బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి అప్పటి రోడ్డు భవనల శాఖ మంత్రి జీవన్‌రెడ్డికి, ఆ శాఖ ఇంజనీర్‌కు ప్రతిపాదనలు పంపించారు. రూ. 37 కోట్లు అవసరం ఆవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పట్టణ శివారు ప్రాంతంతోని చిట్యాల రోడ్డు, గోపాల్‌పేట్, పానగల్, పెబ్బేర్ రహదారులను కలుపుతూ ప్రతిపాదనలు రూపొందించారు. సుమారు 8 కిలో మీటర్ల పోడవున దీనిని అమలు చేయాలన్నుకున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకరావడంలో అప్పటి మంత్రి విఫలమైయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహితం ఈ ఊసే ఎత్తకపోవడంతో రింగ్ రోడ్డు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది.
గతంలో బైపాస్ రహదారి నిర్మాణం చేయడానికి హాడవిడి చేసిన నేతలు ఇప్పుడు బైపాస్ గురించి మాట్లాడటంగానీ, అలాంటి ప్రయత్నాలు నేతలెవ్వరూ చేయడం లేదనేది బహిరంగా రహస్యమే. స్థల సేకరణ జగని కారణంగా బైపాస్ రహదారికి మంజూరైన రూ.80 లక్షలు రెండేళ్ల పాటు మురిగి వెనక్కి వెళ్ళిపోయాయంటే మన నేతల అలసత్వం ఏ పాటిదో అర్ధం అవుతుంది. 2005లో అప్పటి సీఎం దివగంత వైఎస్సార్ నగరబాటలో భాగంగా వనపర్తి పట్టణంలో రహదారుల అభివద్థి ఏర్పాటుకు రూ. 2.5కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. పెబ్బేర్, కొత్తకోట, రహదారుల విస్తరణ రూ. 1.70 కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన రూ. 80 లక్షలతో బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించనున్నారు.
నిర్మాణం ఇలా చేయాలన్నుకున్నారు...
వనపర్తిలోని చిట్యాల చింతల హనుమాన్ దేవాలయం రాజనగరం, నాగవరం, క్రాస్ రోడ్డు వరకు సుమారు 1.6 కిలో మీటర్ల పోడవు 20-30 ఫీట్ల వెడల్పుగా బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని భావించారు.