హోదా కోసం పార్లమెంటులో అడుగుతాం | Ask for the status of Parliament | Sakshi
Sakshi News home page

హోదా కోసం పార్లమెంటులో అడుగుతాం

Mar 9 2015 2:49 AM | Updated on Sep 2 2017 10:31 PM

హోదా కోసం పార్లమెంటులో అడుగుతాం

హోదా కోసం పార్లమెంటులో అడుగుతాం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి ఆదుకోవాల్సిందిగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేయనున్నట్టు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

తాళ్లూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి ఆదుకోవాల్సిందిగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు విజ్ఞప్తి చేయనున్నట్టు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా తాళ్లూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను ప్రత్యేకంగా కలిసి మాట్లాడారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ టీడీపీ చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఎన్నికల సమయంలో మిత్రపక్షంతో కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హైదరాబాద్‌ను మించిన రాజధాని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు సాధించలేకుంటే వారి కూటమి నుంచి తప్పుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.పాత లెవీ విధానం రద్దయితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మిల్లర్లు, వర్తకుల నుంచి కనీస మద్దతు ధర కరువవుతోందన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement