ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసిన పోలీస్‌.. ఆఖరికి | ASI Suspended For Negative Postings On AP Government In Nellore | Sakshi
Sakshi News home page

డీసీఆర్‌బీ ఏఎస్సైపై సస్పెన్షన్‌ వేటు

Sep 5 2019 8:56 AM | Updated on Sep 5 2019 9:07 AM

ASI Suspended For Negative Postings On AP Government In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన డీసీఆర్‌బీ ఏఎస్సై శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సస్పెండ్‌ చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాసరావు ఇటీవల డీసీఆర్‌బీ వాట్సాప్‌ గ్రూప్‌లో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. ఆ గ్రూపులో ఉన్న పోలీసు అధికారులు వీటిని గుర్తించి రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేసి ఏఎస్సైను వెంటనే సస్పెండ్‌ చేయాలని జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగిని ఆదేశించారు. దీంతో మూడురోజుల క్రితం ఏఎస్సైని సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement