
కింద పడిన శ్లాబు పెచ్చులను పరిశీలిస్తున్న ఎంఈవో అమృత్‌కుమార్
విశాఖపట్నం , నాతవరం(నర్సీపట్నం): మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల భవనం శ్లాబుపెచ్చులూడి పడ్డాయి. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. వివరాలు ఇలా ఉన్నాయి ఈ పాఠశాల భవనాలు చాలా కాలంగా శిథిలావస్థలో ఉన్నాయి.శిథలమైన భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమ పాఠశాలలో 201 మంది విద్యార్థులు చదువుతున్నారు. పెథాయ్ తుపాను కారణంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా మంగళవారం శ్లాబు పెచ్చులూడి కిందపడ్డాయి. తరగతులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంఈవో తాడి అమృత్‌కుమార్ పాఠశాలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. శిథిలమైన భవనాల్లో తరగతులు నిర్వహించరాదని హెచ్‌ఎం మణిగోల్డ్‌కు అదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడతూ 1977లో ఈ పాఠశాల భవనాలు నిర్మించారని, అవి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. కొత్త భవనాల కోసం పాడేరు ఐటీడీఏ పీవో ప్రతిపాదించినట్టు చెప్పారు.