తుపాకీ మిస్‌ ఫైర్‌.. ఆర్మీ జవాన్‌ మృతి 

Army Jawan Died After Gun Misfire - Sakshi

అర్ధవీడు: తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మృతి చెందాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులకు సోమవారం అధికారుల నుంచి సమాచారం అందింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన తమ్మినేని అశోక్‌కుమార్‌ (21) రెండేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం విధుల్లో ఉండగా తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో అశోక్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు తల్లిదండ్రులు నరసింహారావు, కాశమ్మలకు సమాచారం అందింది. భౌతికకాయాన్ని స్వగ్రామమైన పాపినేనిపల్లెకు తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. మృతుడికి ఒక సోదరుడున్నాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top