breaking news
ardhaveedu
-
తుపాకీ మిస్ ఫైర్.. ఆర్మీ జవాన్ మృతి
అర్ధవీడు: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను మృతి చెందాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులకు సోమవారం అధికారుల నుంచి సమాచారం అందింది. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెకు చెందిన తమ్మినేని అశోక్‌కుమార్ (21) రెండేళ్ల కిందట ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం విధుల్లో ఉండగా తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తల్లిదండ్రులు నరసింహారావు, కాశమ్మలకు సమాచారం అందింది. భౌతికకాయాన్ని స్వగ్రామమైన పాపినేనిపల్లెకు తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. మృతుడికి ఒక సోదరుడున్నాడు. -
మద్యం మత్తులో హత్య
అర్ధవీడు: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆలుమూరి రమణ(35) అనే వ్యక్తిని ఆయన బావమరిది పోలేపల్లి శ్రీనివాసులు కత్తితో పొడిచాడు. తీవ్రరక్త స్రావం కావడంతో రమణను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయిన మార్గమధ్యంలో మృతిచెందాడు. మద్యం మత్తులో క్షణిక ఆవేశానికి గురై శ్రీనివాస్ ఈ హత్య చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.