ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య | APSC Constable commits suicide | Sakshi
Sakshi News home page

ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య

Aug 5 2013 6:18 AM | Updated on Nov 6 2018 7:53 PM

ఏపీఎస్పీ కానిస్టేబుల్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాపట్ల రైల్వేస్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

బాపట్లటౌన్, న్యూస్‌లైన్ : ఏపీఎస్పీ కానిస్టేబుల్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాపట్ల రైల్వేస్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.  కుటుంబసభ్యుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండల  కేంద్రానికి చెందిన ఈపూ రి శ్రీనివాసరావు(40) 12వ బెటాలియన్‌కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్.  హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూ రెండు రోజుల క్రితం సెలవుపై గ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు.
 
 చెన్నై ఎక్స్‌ప్రెస్ వచ్చే సమయమైందం టూ రాత్రి 9 గంటలకే  ఇంటి నుంచి బాపట్ల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.  రైలు వచ్చింది నేను వెళ్తున్నా అని ఫోన్‌లో భార్య, పిల్లలకు చెప్పారు. అయితే ఆదివారం తెల్లవారుజామున పురుగుమందు తాగి బాపట్ల రైల్వేస్టేషన్‌లో పడి ఉన్నాడని, బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించామని స్థానికులు కుటు ంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. వచ్చి చూసే సరికి శవమై కనిపించాడంటూ కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, కుమార్తె సంధ్య, కుమారుడు మనోజ్‌గోపి ఉన్నారు.
 
 మాకు దిక్కెవరు...?
 తమకు దిక్కెవరంటూ శ్రీనివాసరావు తల్లిదండ్రులు చంద్రరావు, ప్రమీల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ కుమారుడు శంకర్ రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించాడని, రెండో కుమారుడు కూడా మృతి చెందడంతో వృద్ధాప్యంలో ఇక తమను చూసేదెవరని విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement