డేటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు | Applications to Data entry operators | Sakshi
Sakshi News home page

డేటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు

Jun 13 2014 3:57 AM | Updated on Sep 2 2017 8:42 AM

ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో ఆరు నెలలు పనిచేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా పోలీసులు, ఇక్విసిటివ్ ప్రయివేటు సంస్థ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.

విశాఖపట్నం: ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో ఆరు నెలలు పనిచేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖపట్నం జిల్లా పోలీసులు, ఇక్విసిటివ్ ప్రయివేటు సంస్థ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి పూర్తిగా ప్రయివేటు సంస్థ నియామకాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.

డిగ్రీ లేదా పీజీ విద్యార్హత కలిగి, కంప్యూటర్ డేటా ఆపరేటర్‌గా అనుభవమున్న పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసుండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.2500 చెల్లిస్తారు. ఆసక్తి ఉన్నవారు 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను ఎన్.ధర్మాజీ, ఏరియా మేనేజర్, ఇవిజిటివ్ (ఎడ్యూ కన్సల్టింగ్ రీసెర్చ్) సంస్థ, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట అందజేయాలి. వివరాలకు ఫోన్ న ంబరు 9848098060 నంబరులో సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement