ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, కృష్ణారావు (సీఎస్)లు బుధవారం
ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటి!
Sep 10 2014 8:20 PM | Updated on Sep 2 2017 1:10 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, కృష్ణారావు (సీఎస్)లు బుధవారం సమావేశమయ్యారు. వీరిద్దరి సమావేశంలో ఉద్యోగులు, కాలుష్య నియంత్రణ మండలి విభజన, ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
ఈనెల 15న ప్రత్యూష్ సిన్హా కమిటీతో ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటి కానున్నారు. ఇప్పటికే ఈ భేటికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు ఆహ్వానం అందింది. ఇరు రాష్ట్రాల సీఎంల అంగీకారంతో ఐఏఎస్‌లను మార్చుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement