
అసెంబ్లీ అంతర్గత డిజైన్లకు స్పీకర్ ఆమోదం
అసెంబ్లీ అంతర్గత డిజైన్లపై స్పీకర్ కోడెల ఎల్అండ్టీ ప్రతినిధులతో శనివారం చర్చించారు.
ఈ సందర్భంగా ఎల్అండ్టీ ప్రతినిధులు అసెంబ్లీ అంతర్గత డిజైన్ల వివరాలను కోడెలకు వివరించారు. కొద్దిపాటి మార్పులతో వారు ప్రతిపాదించిన డిజైన్లకు స్పీకర్ ఆమోదం తెలిపారు. త్వరలోనే అసెంబ్లీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోడెల ఆదేశించారు.