ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏపీ సచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు
పిల్లల స్థానికతపై కూడా స్పష్టత ఇవ్వండి: ఉద్యోగులు
Sep 16 2014 10:30 PM | Updated on Aug 18 2018 8:27 PM
హైదరాబాద్: ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏపీ సచివాలయ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబును కలిసి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉద్యోగులు మాట్లాడారు.
తమ పిల్లల స్థానికతపై కూడా స్పష్టత ఇవ్వాలని చంద్రబాబును కోరినట్టు ఉద్యోగులు తెలిపారు. హెల్త్‌కార్డులు, పీఆర్సీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్క్షప్తి చేశామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం వెల్లడించారు.
Advertisement
Advertisement