
సాక్షి, పోలవరం (పశ్చిమ గోదావరి జిల్లా) : ఉదయం కార్యవర్గ సమావేశం.. చీకటి పడిన తర్వాత మందు, చిందు.. ఇదీ ఏపీ ఎన్జీవో నేతల నిర్వాకం.. సాక్షాత్తు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సమక్షంలో నేతలంతా ఫుల్‌గా మందుకొట్టి చిందులేశారు. పోలవరంలోని గౌతమీ గెస్ట్‌హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎన్జీవో నేతల సమావేశం అంటూ పిలుపు అందండంతో చాలామంది శనివారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం ఏపీఎన్జీవోల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం మత్తులో ఏపీ ఎన్జీవో నేతలు వయసును మరిచి చిందులేశారు.