ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు

AP Minister Visited At Flooded Areas In Krishna - Sakshi

సాక్షి, అమరావతి: ఎగువ నుంచి వస్తున్న వరద ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ముంపు ప్రాంతాలైన భుపేష్ గుప్తా నగర్, కృష్ణ లంక, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు పామర్రు నియోజకవర్గంలో 9లంక గ్రామాలు పూర్తిగా జలమయ్యం అయ్యాయి. దీంతో  ఆయా గ్రామాల్లో గల 4000 మంది జనాభాను పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్‌ ఆదేశించారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 బోట్లకు పైగా సిద్ధం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 

జిల్లాలోని గని ఆత్కురలులో ఎమ్మెల్యే డా.జగన్‌హోహన్‌రావు పర్యటించారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్‌ పనులను చేపట్టాలని, ముంపులో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరిలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top