వీర జవాను కుటుంబానికి ఆర్థిక సాయం | ap govt financial helps to Soldier mushtaq ahmed family | Sakshi
Sakshi News home page

వీర జవాను కుటుంబానికి ఆర్థిక సాయం

Feb 13 2016 10:07 PM | Updated on Oct 22 2018 8:34 PM

సియాచిన్‌లో మృతి చెందిన ఆర్మీ జవాను ముస్తాక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

విజయవాడ: సియాచిన్‌లో మృతి చెందిన ఆర్మీ జవాను ముస్తాక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. కర్నూలు జిల్లాకు చెందిన ముస్తాక్ సియాచిన్ మంచు చరియల్లో చిక్కుకుపోయి మరణించిన విషయం తెలిసిందే.

ముస్తాక్ అహ్మద్ మాతృదేశం కోసం ప్రాణాలర్పించిన ధీరోదాత్తుడని, యువతకు ఆదర్శంగా నిలిచారని శనివారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. దేశం కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన ముస్తాక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా బాసటగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయంతోపాటు ఇల్లును మంజూరు చేసినట్లు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement