మాస్క్‌ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం ఆదేశం

AP Government Has Issued Orders Making Wearing Mask Compulsory - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా కట్టడికి మరింత కఠినంగా ఆంక్షలు అమలు కానున్నాయి. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమాయాల్లో మాస్కు ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పుకునేలా కవర్ ఉండటాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశిలిచ్చింది. (పది లక్షలు దాటిన కేసులు)

ప్రజలు మాస్కు ధరించేలా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, మాస్కు ధరించటాన్ని అలవాటుగా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఫేస్‌ మాస్కు తప్పనిసరి చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ('కరోనా వైద్యం ఫ్రీగా అందిస్తున్న ఏకైక సీఎం జగన్')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top