రైతు భరోసా కేంద్రాలకు ‘వైఎస్సార్’‌ పేరు

AP Government Has Issued Order Naming YSR For Rythu Bharosa Centres - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలకు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును పెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రైతు భరోసా కేంద్రాలను ‘డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు’గా ప్రభుత్వం వ్యవహరించనుంది. రైతులకు మాజీ సీఎం వైఎస్సార్‌ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో రైతుల ముంగిటకే, వారు తమ ఊరి నుంచి అడుగు బయట పెట్టకుండానే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30న  సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. (కలాం ఆశయాలకు కార్యరూపం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top