యనమలతో అసంపూర్తిగా ఉద్యోగుల పీఆర్సీ భేటీ | ap employees prc meet with minister fails to get result | Sakshi
Sakshi News home page

యనమలతో అసంపూర్తిగా ఉద్యోగుల పీఆర్సీ భేటీ

Jan 13 2015 4:13 PM | Updated on Aug 27 2018 8:44 PM

ఉద్యోగుల పీఆర్సీ విషయమై ఏపీ ఉద్యోగులతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి భేటీ అసంపూర్తిగా ముగిసింది.

ఉద్యోగుల పీఆర్సీ విషయమై ఏపీ ఉద్యోగులతో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. కనీస వేతనం రూ. 15 వేలకు తక్కువ కాకుండా ఉండాలని, ఫిట్మెంట్ 62 శాతం ఇవ్వాలని, ఇంక్రిమెంట్లను 3 శాతానికి పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

కుటుంబ యూనిట్ నలుగురిగా గుర్తించాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పలువురు మంగళవారం నాడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని కలిశారు. అయితే.. దీనికి మంత్రి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో భేటీ అసంపూర్తిగానే ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement