ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌ | AP CM YS Jagan To launch Vahana Mitra In Eluru | Sakshi
Sakshi News home page

ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌

Oct 4 2019 10:19 AM | Updated on Oct 4 2019 10:29 AM

AP CM YS Jagan To launch Vahana Mitra In Eluru - Sakshi

సాక్షి, తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు హెలికాప్టర్‌ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మంజూరు పత్రాలు అందించి లబ్ధిదారులతో మాట్లాడతారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement