ఎల్లుండి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు | ap assembly budget sessions to start from february 10th | Sakshi
Sakshi News home page

ఎల్లుండి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Feb 8 2014 3:33 PM | Updated on Jun 2 2018 4:30 PM

అసెంబ్లీ ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల పదో తేదీ నుంచి ఆరంభకానున్నాయి.

హైదరాబాద్: అసెంబ్లీ ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల పదో తేదీ నుంచి ఆరంభకానున్నాయి. ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి రాం నారాయణ రెడ్డి సోమవారం అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశం అయిన అనంతరం 10.30 గం.లకు ఓటాన్ ఆన్ అకౌంట్ బడ్జెన్ ను అసెంబ్లీ ముందుకు తీసుకురానున్నారు. అయితే మంగళవారం మాత్రం అసెంబ్లీకి సెలవు.  ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి ఆనం భేటీ అయ్యారు.

 

ఈ సమావేశాలను నాలుగు రోజులపాటుజరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసే అసెంబ్లీ సమావేశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం కొందరు మంత్రులతో చర్చించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, ఆ తరువాతి పరిణామాలను అనుసరించి అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement