హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభకు పోలీసుల అనుమతి లభించింది. ఏపీఎన్జీవోల సభకు షరతులతో కూడిన అనుమతిని సీపీ అనురాగ్ శర్మ ఇచ్చారు.
సెప్టెంబర్ 7 తేదిన ఏపీఎన్జీవోల సభకు పోలీసుల అనుమతి!
Sep 3 2013 11:15 PM | Updated on Sep 4 2018 5:07 PM
హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభకు పోలీసుల అనుమతి లభించింది. ఏపీఎన్జీవోల సభకు షరతులతో కూడిన అనుమతిని సీపీ అనురాగ్ శర్మ ఇచ్చారు. ఎల్బీస్టేడియంలో సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలు సమావేశం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
ఏడవ తేది మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే సభ నిర్వహించాలని పోలీసులు సూచించారు. సభకు వచ్చే ఉద్యోగులంతా ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలి అని పోలీసులు తెలిపారు. కొన్ని పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఇతరులకు అనుమతి లేదు అని పోలీసులు స్పష్టం చేశారు.
Advertisement
Advertisement