ఊరికి వెళ్లిపోతాం..

Andhra Teachers Stranding in Telangana - Sakshi

తెలంగాణలో ఆంధ్రా ఉపాధ్యాయుల అవస్థలు

సొంత రాష్ట్రానికి పంపించాలని జగన్‌కు వినతి

పథకాలు వర్తించక, కుటుంబ సభ్యులను కలవక అవస్థలు పడుతున్న గురువులు

సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జగన్‌  

జలుమూరు: విభజనతో రెండు రాష్ట్రాలకు అయి న గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ గా యాలకు ఆనవాలుగా ఇరు రాష్ట్రాల్లోనూ వేదనలు, రోదనలు ఇంకా వినిపిస్తున్నాయి. ఆ కోవలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. రాష్ట్రం కలిసి ఉ న్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు సం పాదించిన ఇక్కడి వారు వేరైపోయాక కూడా అక్క డే ఉండిపోయారు. ఎప్పుడెప్పుడు సొంత రాష్ట్రానికి వద్దామా అని ఎదురు చూస్తున్న ఆంధ్రా ఉపాధ్యాయుల ఆశలను ఎవరూ పట్టించుకోవడం లే దు. నాలుగున్నరేళ్లుగా వారు కనిపించిన ప్రతి నా యకుడికీ వినతులు ఇస్తూనే ఉన్నారు. కానీ సర్కా రు మాత్రం స్పందించడం లేదు. తాజాగా శని వారం నాన్‌లోక్‌ల్‌ టీచర్‌ అసోసియేషన్‌(ఎన్‌ఎల్‌టీఏ) నాయకులు తునిలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ సమస్యలు వివరించారు. 

సొంత రాష్ట్రానికి వచ్చేలా సాయం చేయాలని జగన్‌కు విన్నవించినట్లు ఆ సంఘ నా యకులు వాన సూర్యనారాయణ, డి.సురేష్, బి.భాస్కర్, వి.గౌరునాయుడులు తెలిపారు. దీనిపై జగన్‌ సానుకూలంగా స్పందించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. 

కుటుంబాలకు దూరంగా.. 
తెలంగాణలో సుమారు 330 మంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. 

అలాగే అక్కడ తెలం గాణ ప్రభుత్వం మంజూరు చేస్తున్న హెల్త్‌కార్డులు ఇక్కడ కుటుంబ సభ్యులకు వర్తించడం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులకు కనీసం వైద్యం చేయించలేక వారు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా మహిళలకు వివాహాలు, డిప్యుటేషన్లు వంటి సమస్యలతో ఇక్కట్లు పడుతున్నారు.  

పిల్లల భవిష్యత్‌ ఏంటి..? 
మేం జీవిత కాలం తెలంగాణలో ఉండాల్సిందేనా..? ఎవరో చేసిన తప్పునకు మేం బలైపోతున్నాం. మా పిల్లల భవిష్యత్‌ ఏంటి. జగన్‌ సార్‌ ఇచ్చిన హామీతో భరోసా వచ్చింది.
–వాన సూర్యనారాయణ, కరవంజ గ్రామం, జలుమూరు, ఎన్‌ఎల్‌టీఏ ప్రధాన కార్యదర్శి 

వివాహాల సమస్య.. 
అక్కడ లోకల్‌ నాన్‌లోకల్‌ అన్న సమస్యతో పాటు వి వాహ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. మేం ఉ ద్యోగం చేసేది తెలంగాణలో మా బంధువులు ఉన్నది ఆంధ్రాలో. పెళ్లి విషయంలో ఇదే అడ్డుపడుతోంది. వీటికి పరిష్కారం ఒక్కటే.. మమ్మల్ని ఏపీకి పంపడమే. 
– జి.తులసి, పాలకొండ, ఎస్జీటీ టీచర్,తెలంగాణ 

అందరూ ఉన్నా.. అనాథలమే 
తెలంగాణ నుంచి ఏపీకి రా వాలని పలు మార్లు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరిగా జగన్‌మోహన్‌ రెడ్డిని కలి శాం. ఆయన కచ్చితమైన భరోసా ఇచ్చారు. స్వగ్రామం వస్తామని ఆశ ఉంది. ఇక్కడ మా పిల్లలను చదివిస్తే ఇక్కడ కూడా స్థానికేతరులుగా ఉండిపోతాం. అం దరూ ఉన్నా అనాథల్లా మారుతున్నాం.
–వి.గౌరునాయుడు, మందరాడ, సంతకవిటి మండలం, ఉపాధ్యాయుడు, తెలంగాణ 

అన్నీ అవమానాలే 
తెలంగాణలో ఉద్యోగం సంపాదించి సుమారు 8 ఏళ్లు గడుస్తోంది. విభజన అనంతరం సొంత రాష్ట్రానికి వస్తామని ఆశతో ఎదురు చూశాం. ఆశ నెరవేరలేదు. ఇక్కడ అడుగుఅడుగునా అవమానాలే ఎదుర్కొంటున్నాం. ఎందరో నాయకులకు కలిసి మొరపెట్టుకున్నాం. పని జరగలేదు. జగన్‌తో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
– డి.సుధీర్, రేగిడి ఆమదాలవలస,
 ఉపాధ్యాయుడు, తెలంగాణ  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top