తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ నెట్‌వర్కింగ్‌పై హ్యాకర్స్ మరోసారి పంజా విసిరారు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ నెట్‌వర్కింగ్‌పై హ్యాకర్స్ మరోసారి పంజా విసిరారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని 25 శాతం పోలీస్ స్టేషన్లలో నెట్‌వర్క్ పనిచేయడం లేదు. విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతితో పాటు పలు పోలీస్ స్టేషన్లలో నిన్న సాయంత్రం నుంచి కంప్యూటర్లు పని చేయడం లేదు. దీనిపై తిరుపతి వెస్ట్ జోన్ పీఎస్‌లో శనివారం సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు అయింది.
విండోస్ వాడుతున్న కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు నిర్థారణ కావడంతో పోలీసులు...సాంకేతిక సమస్యను డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ తన కంప్యూటర్ హ్యాక్ కాలేదని తెలిపారు. తాను ఆండ్రాయిడ్ వెర్షన్ వాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఒక్క ఏపీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 దేశాల్లో కంప్యూటర్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే.