సీఎం పర్యటన ఇలా | Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu tour in Eluru | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఇలా

Dec 12 2014 1:44 AM | Updated on Sep 2 2017 6:00 PM

సీఎం పర్యటన ఇలా

సీఎం పర్యటన ఇలా

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉంగుటూరు

ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉంగుటూరు మండలం కైకరంలో జరిగే రైతు సాధికార సదస్సులో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 12.55 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 1.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి కైకరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం  2.15 గంటల నుంచి 5.30 గంటల వరకు రైతు సాధికార సదస్సులో పాల్గొని, రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రుణమాఫీకి అర్హులైన వారికి రుణ ఉపశమన పత్రాలను అందిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కైకరం హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 6.15 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement