వారం రోజుల్లో కొత్త సీఎం : శంకర్రావు | Anam Ramnarayana Reddy for CM's chair?: Former Minister Shankar Rao | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో కొత్త సీఎం: శంకర్రావు

Oct 5 2013 8:42 AM | Updated on Jul 29 2019 5:31 PM

వారం రోజుల్లో కొత్త సీఎం : శంకర్రావు - Sakshi

వారం రోజుల్లో కొత్త సీఎం : శంకర్రావు

ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్‌రెడ్డిని తప్పించడం ఖరారైపోయిందని మాజీ మంత్రి పి.శంకర్రావు చెప్పారు.

 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్‌రెడ్డిని తప్పించడం ఖరారైపోయిందని మాజీ మంత్రి పి.శంకర్రావు చెప్పారు. వారం రోజుల్లో రాష్ట్రానికి కొత్త సీఎం రాబోతున్నారని, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పారు.

సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అధిష్టానాన్ని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘నీకు గౌరవం కూడా ఉందా? నీ ఊరికే వెళదాం. ప్రజలు నీకు గౌరవమిస్తారో? మాకు ఇస్తారో తేల్చుకుందాం.    విభజన విషయంలో అంతా స్టేజీ షో నడిపిస్తున్నావ్? ఎవరిని ఎప్పుడు ఎట్లా సెట్ చేయాలో హైకమాండ్‌కు తెలుసు. ఐదు రోజుల్లో సీఎం ప్లగ్ పీకేయడం ఖాయం’’అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement