
చక్కటి వేదిక క్రీడా కాంప్లెక్స్
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్‌ఏ ఆవరణంలో నిర్మించనున్న క్రీడాకాంప్లెక్స్ యువతకు చక్కటి వేదిక అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్‌ఏ ఆవరణంలో నిర్మించనున్న క్రీడాకాంప్లెక్స్ యువతకు చక్కటి వేదిక అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం డీఎస్‌ఏ ఆవరణంలో స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో క్రీడాభివృద్ధి శరవేగంగా సాగిందన్నారు. వచ్చే వేసవి నాటికి స్కేటింగ్ మైదానంతో పాటు స్విమ్మింగ్‌పూల్ నగర ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.
కడప నగరపాలక మేయర్ కె. సురేష్‌బాబు మాట్లాడుతూ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కడప కార్పొరేషన్, ఎంపీ, ఎమ్మెల్యే నిధులు రూ. 32 లక్షలతో స్కేటింగ్ మైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, సీఆర్‌ఐ సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు.