లాఠీచార్జిని ఖండిస్తున్నాం: అంబటి | ambati rambabu condemns lathicharge on rtc workers | Sakshi
Sakshi News home page

లాఠీచార్జిని ఖండిస్తున్నాం: అంబటి

May 8 2015 8:18 PM | Updated on May 25 2018 7:29 PM

లాఠీచార్జిని ఖండిస్తున్నాం: అంబటి - Sakshi

లాఠీచార్జిని ఖండిస్తున్నాం: అంబటి

చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు.

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. న్యాయబద్దమైన హక్కుల కోసం పోరాడితే లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరులో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement