సేవ్ ఆంధ్రప్రదేశ్కు అందరిని అనుమతించాలి | Allow all to Save Andhra Pradesh meeting, asks Ashokbabu | Sakshi
Sakshi News home page

సేవ్ ఆంధ్రప్రదేశ్కు అందరిని అనుమతించాలి

Sep 4 2013 12:56 PM | Updated on Sep 1 2017 10:26 PM

ఏపీఎన్జీవోలు ఈ నెల 7న తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను నిర్వహించి తీరుతామని ఆ సంఘం అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు.

ఏపీఎన్జీవోలు ఈ నెల 7న తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభను నిర్వహించి తీరుతామని ఆ సంఘం అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సభను అడ్డుకుంటే తెలంగాణ వాదం బలహీనపడినట్లే ఆని ఆయన వ్యాఖ్యానించారు.

 

సభకు ఉద్యోగుల కుటుంబ సభ్యులు, విద్యార్థులను అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరతామని ఆయన తెలిపారు. అయితే ఈ నెల 7వ తేదీన నగరంలోని ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆ రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సభను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

 

అయితే ఆ సభకు ఏపీఎన్జీవోల కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ సభకు హాజరుకాకూడదని ఓ నిబంధన విధించింది. ఆ అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని ఆయన విలేకర్ల సమావేశంలో తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ గుర్తింపు కార్డులను ప్రదర్శిస్తేనే బహిరంగ సభకు అనుమతిస్తామని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement