చుక్కల మందుకు అంతా సిద్ధం | all set to pulse polio today | Sakshi
Sakshi News home page

చుక్కల మందుకు అంతా సిద్ధం

Feb 23 2014 1:18 AM | Updated on Oct 17 2018 6:06 PM

చుక్కల మందుకు అంతా సిద్ధం - Sakshi

చుక్కల మందుకు అంతా సిద్ధం

రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శనివా రం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు.

 నేటి నుంచి రెండో విడత పల్స్‌పోలియో
 మూడు రోజుల పాటు..
 3,31,580  మంది చిన్నారులకు
 చుక్కలు వేయడం లక్ష్యం
 జేసీ వెంకటేశ్వర్‌రావు వెల్లడి
 
 నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్:
 రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. శనివా రం ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. మూడు రోజుల పాటు వైద్య సిబ్బంది పోలియో చుక్కలను వే స్తారని తెలిపారు. 3,31,580 మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు చుక్కల మందును వేయడం లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. పోలియో చుక్కలు వేసేందుకు పట్టణ ప్రాంతాల్లో 247 బూత్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో 1386 బూత్‌లు, ట్రాన్సిట్ బూత్‌లు 77, మొబైల్ బూత్‌లు 1760 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం 171 మంది సూపర్‌వైజర్లు, 7380 మంది వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పారు. వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. వలస వచ్చిన కుటుంబాలు, ఇటుక బట్టీల వద్ద పనిచేసేవారు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో, మారుమూల తండాల్లో, మురికివాడల్లో నివసించే పిల్లలకు పోలియో చుక్కల మందు వేయనున్నట్లు జేసీ పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
 
 నగరంలో ర్యాలీ
 పల్స్‌పోలియో కార్యక్రమం పురస్కరించుకొని శనివారం ఉదయం నగరంలో ర్యాలీ నిర్వహిచారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద  వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోవింద్‌వాగ్‌మోరే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా  ఇమ్యూనైజేషన్ అధికారి విజయ్‌కుమార్, నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement