ఆస్తులన్నీ వెబ్సైట్లో! | All properties in Website! | Sakshi
Sakshi News home page

ఆస్తులన్నీ వెబ్సైట్లో!

Jul 28 2014 3:18 PM | Updated on Oct 9 2018 5:03 PM

మాణిక్యాల రావు - Sakshi

మాణిక్యాల రావు

అన్నిదేవాలయాల ఆస్తులు, ఆదాయవ్యయాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు.

హైదరాబాద్: అన్నిదేవాలయాల ఆస్తులు, ఆదాయవ్యయాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. టీటీడీలో వీఐపీ దర్శనాల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నామన్నారు. రోజుకు 800 నుంచి వెయ్యి వరకూ మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు. త్వరలో 300 రూపాయల దర్శనాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సిందేనన్నారు. వీఐపీ లెటర్‌లు ఇకపై చెల్లవని చెప్పారు. ఈ విషయంలో తనపై చాలా ఒత్తిడి ఉందని, అయినా సరే అమలు చేసి తీరుతామన్నారు. దేవాదాయశాఖను ఆర్టీఐ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు.

ప్రతి జిల్లాలో హిందూసనాతన ధర్మం సబ్జెక్ట్‌గా ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ ఏర్పాటుచేస్తామన్నారు. దాతల సహకారంతో వాటిని నిర్వహిస్తామని  మంత్రి మాణిక్యాలరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement