రన్‌వేపై ఊగిపోయిన విమానం | AirIndia flight lands on second attempt | Sakshi
Sakshi News home page

రన్‌వేపై ఊగిపోయిన విమానం

Nov 16 2017 7:53 AM | Updated on May 3 2018 3:20 PM

AirIndia flight lands on second attempt - Sakshi

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతున్న ఎయిర్‌ ఇండియా విమానం గాలి ఉధృతికి ఊగిపోయింది. దీంతో విమానంలో ఉన్న ప్రజాప్రతినిధులు సహా ప్రయాణికులు అంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి విశాఖకు బుధవారం సాయంత్రం 4.30కి రావాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం 5.30 గంటలకు వచ్చింది. విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో భారీస్థాయిలో గాలి వీచడంతో మహిళా పైలెట్‌ విమానాన్ని దించకుండా టెకాఫ్‌ తీసుకున్నారు. గంటకుపైగా గాల్లోనే చక్కర్లు కొట్టించి ఎట్టకేలకు సురక్షితంగా విశాఖ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. దీంతో విమానంలో ఉన్న రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్‌ గణబాబు, ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, మరో 60 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement