‘పొట్టి రాంబాబు’ హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’ | Actor Potti Rambabu in Puliraja IPS Movie | Sakshi
Sakshi News home page

‘పొట్టి రాంబాబు’ హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’

Jan 19 2015 2:52 AM | Updated on Sep 2 2017 7:52 PM

‘పొట్టి రాంబాబు’ హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’

‘పొట్టి రాంబాబు’ హీరోగా ‘పులిరాజా ఐపీఎస్’

సాధారణంగా పోలీసయ్యేందుకు పొడవు ఒక ప్రధాన కొలమానమని, అయితే మూడు నాలుగడుగుల పొడవే ఉన్నా పోలీస్ అవ్వాలన్నది

 జగ్గంపేట : సాధారణంగా పోలీసయ్యేందుకు పొడవు ఒక ప్రధాన కొలమానమని, అయితే మూడు నాలుగడుగుల పొడవే ఉన్నా పోలీస్ అవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకుని వ్యక్తి  కథతో తీస్తున్న చిత్రమే ‘పులిరాజా ఐపీఎస్’ అని హాస్యనటుడు  పొట్టి రాంబాబు, ఆ చిత్రం డెరైక్టర్ రాఘవ తిరువానిపాటి తెలిపారు. ఆదివారం జగ్గంపేట వచ్చిన వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పొట్టి రాంబాబు హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ గురించి వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలోనే ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెల 29 నుంచి రెగ్యులర్‌గా షూటింగ్ జరుపుతామని డెరైక్టర్ రాఘవ తెలిపారు. హీరో పొట్టి రాంబాబుకు తండ్రిగా ఎంఎస్ నారాయణ నటిస్తున్నారని, ఆయన ఈ చిత్రంలో కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. ఆయన కుమారుడైన రాంబాబును పోలీసు చేయాలని కలలు కంటారని, అయితే తక్కువ పొడవున్న రాంబాబు ఏ విధంగా ఐపీఎస్ అవుతాడనేదే కథలో ప్రధానమని వివరించారు. హీరోగా తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, చిత్రం విజయానికి శ్రమించి  పనిచేస్తున్నానని రాంబాబు తెలిపారు. వీరితో పాటు హాస్యనటుడు బబ్లూ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement