
సినీ నటుడు మోహన్‌బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వందేళ్లు అద్భుతంగా ఆయురారోగ్యాలతో దేదీప్యమానంగా ఉంటారని సినీనటుడు మోహన్‌బాబు ఆకాంక్షించారు. ఆయన శుక్రవారం జగన్ నివాసానికి వచ్చి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘హి విల్‌బి ఆల్‌రైట్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్’ అన్నారు. జగన్ క్షేమంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తూ తాను పరామర్శకు వచ్చానని, రాజకీయాలు వద్దన్నారు.
జాతీయ స్థాయిలో సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్‌తో జత కట్టడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దయచేసి తనను రాజకీయాల గురించి ఇప్పుడు అడగొద్దని, మాట్లాడాల్సిన రోజు వస్తే కచ్చితంగా మాట్లాడతానని మోహన్‌బాబు సున్నితంగా తిరస్కరించారు.