18 ఇళ్ల స్థలాలు, రెండు కిలోల బంగారం! | ACB raids on Transport officer in Nellore | Sakshi
Sakshi News home page

May 1 2018 11:49 AM | Updated on Aug 17 2018 12:56 PM

ACB raids on Transport officer in Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు : రవాణా శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ సరసింహా రెడ్డి ఇంటిపై ఏసీబీ మంగళవారం దాడులు చేసింది.  జిల్లాలోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.  ఆయన ఇల్లు, కార్యాలయంతో పాటు పట్టణంలోని బంధు, మిత్రుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. ఈ దాడుల్లో నగదు, పెద్ద ఎత్తున డాక్యుమెంట్‌ పత్రాలను స్వాధీనపరచుకున్నారు. పలువురు రవాణా శాఖ ఉద్యోగులకు నరసింహారెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఈ దాడుల్లో గుర్తించారు.  నగరంలోని ఇతర రవాణా అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ మెరుపు దాడులు చేసింది. నరసింహారెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో ఆయనకు నెల్లూరులో 18 ఇళ్ల స్థలాలు, రెండు కిలోల బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement