గాజువాక సబ్‌రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
విశాఖపట‍్టణం: గాజువాక సబ్‌రిజిస్ట్రార్ వెంకయ్యనాయుడు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో వెంకయ్యనాయుడుకు చెందిన ఆస్తులపై విశాఖ, తిరుపతిలోని ఆరు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. గతంలో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన ఆస్తులపై ఏసీబీ దాడులు చేసింది. గత మూడేళ్లుగా గాజువాక సబ్‌రిజిస్ట్రార్‌గా వెంకయ్యనాయుడు విధులు నిర్వహిస్తున్నారు.