పరీక్ష కేంద్రంలోనే ఓ డీఎస్సీ అభ్యర్థిని ప్రసవించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
విజయనగరం: పరీక్ష కేంద్రంలోనే ఓ డీఎస్సీ అభ్యర్థిని ప్రసవించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిండు గర్భిణి గొటివాడకు చెందిన సుగుణ పరీక్షకు హాజరైంది. ఆమెది కురుపాం మండలం గొటివాడ గ్రామం. మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పరీక్ష రాసేందుకు హాజరైంది.
అయితే, పరీక్ష ప్రారంభమైన గంటకే నొప్పులు రావడంతో అధికారులు 108కు సమాచారం ఇచ్చారు. 108 రాకపోవడంతో పరీక్ష హాలులోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రైవేట్ అంబులెన్స్లో తల్లీ కొడుకులను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించే లోపే శిశువు ఆస్పత్రిలో కన్నుమూసింది.